Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Sweet Home

ఈ గింజలతో వేసవితాపం తీర్చేద్దాం..!

మండు వేసవి అంటే ఇదేనేమో.. అనిపిస్తోంది బయట వాతావరణం చూస్తుంటే.. ఎండల ధాటికి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. లోపలే ఉన్నా.. ఎండల వల్ల డీహైడ్రేషన్, వేడి వంటివి తగ్గట్లేదు. వీటన్నింటి నుంచీ విముక్తి కలిగించే అద్భుతమైన శక్తి సబ్జ గింజలకుంది.. నల్లని ఈ చిన్న గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వేడి పరారైపోవాల్సిందే..! అందుకే వాటితో చేసే ఈ రెసిపీలను ప్రయత్నించి చూడండి..  Read More

మన ఫోను, ఏటీఎం.. టాయిలెట్స్ కంటే కలుషితమని తెలుసా ?

స్మార్ట్‌ఫోన్ ! ఇప్పుడు మనిషికిదో కృత్రిమ అవయవంలా మారిపోయింది. కాళ్లు లేకుండా నడవగలం, చేతులు లేకపోయినా పని చేయగలమేమో గానీ ఫోన్ లేకపోతే బతకలేం అనే స్థాయికి మనం వచ్చేశామని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అదే మన ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఇంకా శత్రువు కూడా ! అదేంటీ శత్రువెలా అయిందనుకుంటున్నారా ? కేవలం ఫోనే కాదు !

మనం నిత్యం వినియోగించే ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలు వంటి చాలా వస్తువులు పబ్లిక్ టాయిలెట్ల కంటే ప్రమాదకరమంటున్నారు వైద్యులు. మరి అదెలానో ఒకసారి చూద్దాం పదండి !   Read More

లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఇప్పుడే నమ్ముతున్నా.!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం 2016లో కల్యాణ్ దేవ్‌తో జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఈ పాపకు నవిష్క అని నామకరణం చేశారు.

అయితే ఈ పాపకు సంబంధించిన ఫొటోలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదీ జంట. ఈక్రమంలో తాజాగా తమ గారాల పట్టి జన్మించి నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా.. నవిష్క లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రీజ, కల్యాణ్.  Read More

ఘాటైన ‘మసాలా ఛాయ్’తో భలే మజా!

కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలు కాదు చాలామందికి. అయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, బరువును అదుపులో ఉంచుకోవడానికి గ్రీన్ టీ, అల్లం టీ, పుదీనా టీ…Read more

‘ఇద్దరం ముగ్గురం అవుతున్నామ’ని అలా చెప్పారు!

అన్యోన్య దాంపత్యానికి, ఆలుమగల అనురాగానికి ప్రతిరూపాలు పిల్లలు. అందుకే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిసిన మరుక్షణం దంపతుల కళ్లు మతాబుల్లా వెలిగిపోతాయి. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో ఎప్పుడెప్పుడు చెబుదామా అని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో స్వీట్లు పంచుతూ చెప్పే వారు కొందరైతే, రాబోయే పాపాయికి సంబంధించిన బుజ్జి బుజ్జి డ్రస్సుల్ని ఇంట్లో వారికి చూపుతూ తమ ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసే వారు మరికొందరుంటారు..

ఇంకొందరేమో.. ‘మీరు త్వరలో అమ్మమ్మ-తాతయ్య/నాన్నమ్మ-తాతయ్య కాబోతున్నారు..’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేవారూ లేకపోలేదు.. మరి, ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‌లో మనకే ఇన్ని ఆలోచనలుంటే..

ఇక బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల సంగతేంటి..? వారూ ఎంతో డిఫరెంట్‌గా తమ ప్రెగ్నెన్సీ గురించి అందరికీ తెలియజేసి తమ అభిమానుల మనసు దోచుకున్నారు. అలా తాజాగా మన ముందుకొచ్చాడు బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో అర్జున్ రాంపాల్. తన గర్ల్‌ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మోడల్ అయిన గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ ప్రస్తుతం గర్భవతి అని, త్వరలో తామిద్దరం ఓ బుజ్జి పాపాయికి జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడీ రొమాంటిక్ హీరో. ఈ నేపథ్యంలో విభిన్న పద్ధతుల్లో తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి అభిమానుల మనసు దోచుకున్న కొందరు తారల గురించి తెలుసుకుందాం రండి..  Read More

కోడిగుడ్లతో మ్యాజిక్ చేసేయండిలా..!

‘సండే హో యా మండే రోజ్ ఖావో అండే’ అని.. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. కానీ అప్పటి వరకూ అమ్మచేతి వంట తిని, సడన్‌గా చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో స్వయం పాకం చేసుకోవాల్సి వస్తే అప్పుడు కానీ అర్థంకాదు.. అమ్మ చేసినంత సులభంగా గుడ్డుతో అన్ని వెరైటీలు చేయడం మనకు సాధ్యం కాదని..!

గుడ్డు పగలకొట్టడం, సరైన వేడిలో వండడం.. అన్నీ పజిల్‌లా అనిపిస్తాయి కదూ..!

ఈ పజిల్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల గాడ్జెట్స్ వచ్చేశాయి. అవేంటో తెలుసుకోవాలంటే చదవండి మరి..!  Read More 

నా అధిక బరువుకు ఇర్రెగ్యులర్ పిరియడ్సే కారణమా?

హాయ్ మేడం. నా వయసు 36. నాకు పెళ్త్లె 19 ఏళ్త్లెంది. ఇద్దరు పిల్లలున్నారు. నాకు మొదట్నుంచీ ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య ఉంది. దీంతో పిల్లలు కారేమో అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల పెళ్త్లెన ఏడాదికే గర్భం ధరించా. ఇక గత రెండేళ్ల నుంచి పిరియడ్స్ సమస్య మరింత ఎక్కువైంది. నెలకో, రెండు నెలలకో, ఒక్కోసారి మూడు నెలలకు కూడా నెలసరి వస్తుంటుంది. ఈసారి కూడా పిరియడ్ రాక మూడు నెలలవుతోంది. డాక్టర్ దగ్గరికెళ్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారు.

కానీ నాకు రెండోసారి డెలివరీ అప్పుడే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేశారు. ఈ మధ్య నేను బాగా లావైపోతున్నా. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నా.. దాంతో కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తుంది. నా సమస్యల్లా ఇర్రెగ్యులర్ పిరియడ్స్.. బాగా బరువు పెరగడం.. కాళ్లలో నీరు కూడా బాగా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?

నేను బరువు పెరగడానికి ప్రధాన కారణమేంటి? పిరియడ్స్ సక్రమంగా రావాలంటే ఏంచేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు.  Read More

సమ్మర్ సర్‌ప్రైజ్.. కేక్ పాప్స్ !

కేక్, చాక్లెట్ల క్రేజీ కాంబినేషనే ఈ కేక్ పాప్స్.! పిల్లలకీ, పెద్దలకీ చూడగానే నోరూరించే ఈ కొత్త రెసిపీ ఎలా తయారు చేయాలో తెలియాలంటే.. చదవండి మరి.   Read More

పిల్లలు వద్దనుకుంటున్నాం.. ఏ పద్ధతులు పాటించాలి?

హలో డాక్టర్. నాకు పెళ్త్లె నాలుగేళ్లవుతోంది. మాకు ఇరవై నెలల బాబున్నాడు. మరో మూడేళ్ల వరకు పిల్లలు వద్దు అనుకుంటున్నాం. అందుకే నేను ప్రెగ్నెన్సీ రాకుండా కొన్ని రోజుల వరకు ఎమర్జెన్సీ పిల్స్ వాడాను. కానీ దానివల్ల ఆరోగ్య సమస్యలొస్తాయని తెలుసుకొని ఐయూడీ కాపర్ టీ వేయించుకున్నాను. అప్పట్నుంచి నేను నా భర్తతో కలిసినప్పుడు మంటగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. దీన్నుంచి బయటపడే మార్గమేంటో తెలుపగలరు. అలాగే ఇంకా వేరే ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతుంటే వివరించండి.- ఓ సోదరి  Read More

Create a free website or blog at WordPress.com.

Up ↑