Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Work & Life

ఆ రాజకుటుంబంలో తల్లిపాలే పట్టాలి!

గర్భం దాల్చిన మహిళలు లేట్ నైట్స్ బయట తిరగకూడదు.. అదీ.. ఆదివారం-అమావాస్య రోజు రాత్రి అస్సలు బయటకు వెళ్లకూడదు..
గర్భం ధరించాక మూడు నెలల తర్వాత మాత్రమే తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరికీ తెలియజేయడం మంచిది..
గర్భం ధరించిన సమయంలో దూర ప్రయాణాలు సురక్షితం కాదు..
ఇలా గర్భం ధరించిన మరుక్షణం నుంచీ బిడ్డ పుట్టే వరకూ కాబోయే అమ్మలకు మన ఇళ్లల్లోని పెద్ద వారు ఎన్నో రకాల నియమాలు, నిబంధనలు విధించడం మనకు తెలిసిందే. అంతేకాదు.. సీమంతం.. వంటి ప్రత్యేక వేడుకలతో కాబోయే అమ్మ ఒడి నింపి ఆమెను సంతృప్తి పరచడం మన సంప్రదాయం కూడా! ఇలాంటి సంప్రదాయాలు, నియమాలు మనకే కాదు.. బ్రిటన్ రాజకుటుంబంలోనూ బోలెడున్నాయి. బిడ్డ కడుపులో పడిన మరుక్షణం నుంచి పాపాయికి జన్మనిచ్చే వరకూ కాబోయే అమ్మలకు ఆ కుటుంబం పెట్టే నియమాలు, ఆచరించే సంప్రదాయాలు ఎన్నో! త్వరలో ప్రిన్స్ హ్యారీ – మేగన్ మార్కల్ జంట రాయల్ బేబీకి జన్మనివ్వబోతున్న సందర్భంగా శతాబ్దాల నుంచి బ్రిటన్ రాజకుటుంబం పాటిస్తోన్న కొన్ని ప్రెగ్నెన్సీ ట్రెడిషన్స్ గురించి మీకోసం..   Read More

అక్కడ ప్యాకింగ్ అంతా అరటాకుల్లోనే..!

సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెద్దామన్నా, సంతకెళ్లి కూరగాయలు కొందామన్నా, ఇంట్లో ఏదైనా వస్తువు దాచి పెడదామన్నా, ఆఫీసుకు తీసుకెళ్లడానికి ఏవైనా చిరుతిళ్లు ప్యాక్ చేయాలన్నా..

ఇలా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ప్లాస్టిక్ మన జీవితంలో ఓ భాగమైపోయింది. ప్లాస్టిక్ కవరో, డబ్బానో లేనిదే రోజు గడవదేమో అన్నంతలా అది మన లైఫ్‌స్త్టెల్లో మమేకమైపోయింది.

అయితే లక్షల సంవత్సరాలైనా భూమిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మూగజీవాలకు ఎంతో నష్టం కలుగుతోంది. అందుకే దీన్ని నిర్మూలించడానికి ఓ వినూత్న ఆలోచన చేసింది థాయ్‌ల్యాండ్‌లోని ఓ సూపర్ మార్కెట్.

వారు చేసిన ఈ సరికొత్త ప్రయోగం అంతర్జాలంలో వైరల్‌గా మారడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న సందేశాన్ని అందిస్తోంది. మరి, ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.. Read More

కరీనా ఫిట్‌నెస్ సీక్రెట్.. ఈ వీడియోలో ఉంది!

ఫిట్‌నెస్ అంటే ప్రాణమిచ్చే బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అందాల తార కరీనా కపూర్ ముందు వరుసలో ఉంటుంది. ఒక నటిగా తను ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరినీ అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఫిట్‌నెస్‌దే కీలక పాత్ర అని చెబుతోందీ బ్యూటిఫుల్ మామ్. ప్రెగ్నెన్సీ సమయంలోనూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేది బెబో. ప్రసవానంతరం అత్యంత తక్కువ సమయంలో బరువు తగ్గి, తిరిగి నాజూగ్గా మారింది.

తను తీసుకునే ఆహారంతో పాటు చేసే వ్యాయామాలూ ఇందుకు ప్రధాన పాత్ర పోషించాయని కరీనా ఇది వరకే వివిధ సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం తాను వ్యాయామం చేయడమే కాదు.. తాను చేసిన వ్యాయామాల్ని వీడియోలు, ఫొటోల రూపంలో బంధించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తిని నింపడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. అలా తాజాగా ఈ అందాల అమ్మ చేసిన ఓ ఫిట్‌నెస్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  Read More

రొమాంటిక్ ఫొటోషూట్ అనుకుంటే.. నీటిలో పడ్డారు!

వెడ్డింగ్ ఫొటోషూట్.. కొత్తగా వివాహబంధంలోకి అడుగిడబోతోన్న దంపతులు తమ పెళ్లి నాటి జ్ఞాపకాల్ని కలకాలం గుర్తుండేలా చేయడం కోసం ఏర్పాటుచేసుకుంటున్న ఫొటో సెషన్ ఇది. ఇందుకోసం మొన్నటిదాకా ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకున్న కపుల్స్.. ఇప్పుడు సాహసాలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి ఓ సాహసమే చేశారు కేరళకు చెందిన ఈ కాబోయే వధూవరులు…Read more

మహిళల రక్షణ కోసం ‘ఎం.ఆటో’ !

పట్ట పగలే మహిళలకు రక్షణ లేని రోజులివి. అదే నైట్ షిఫ్ట్ ఉద్యోగానికి వెళదామంటే.. క్యాబ్ డ్రైవర్ ఎలాంటి వాడో ? రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, పోనీ ఆటోలో వెళ్దామంటే… ఏం జరుగుతుందో ? ఇవన్నీ సగటు మహిళలో తలెత్తే భయాలు. అందుకు కారణం నిత్యం మహిళలపై జరుగుతున్న అరాచకాలే. అందుకే మహిళల రక్షణ కోసం వివిధ సంస్థలు వినూత్న పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. ఈ కోవకు చెందిందే..Read more

నేనే మేకప్ వేసుకోను.. అలాంటిది ఆ పనెలా చేయగలను?

సినిమాల్లో దూసుకుపోతున్న హీరోహీరోయిన్లకు ప్రకటనల్లో నటించే అవకాశమొస్తే ఏం చేస్తారు..? కళ్లకద్దుకొని మరీ ఆ ఆఫర్‌ను స్వీకరిస్తారు. కానీ మన రౌడీ బేబీ మాత్రం అందుకు భిన్నం. ఇప్పటికే ‘ఫిదా’, ‘మారీ-2’, ‘పడి పడి లేచె మనసు’.. వంటి చిత్రాలతో దక్షిణాది సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటిదాకా ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడం విశేషం..Read more

ఈ వూళ్లు ఆడవాళ్లకు మాత్రమే !

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం మంది మహిళలు నిత్యం మగవారి చేతిలో ఏదో ఒకరకంగా వేదనకు గురవుతున్నట్లు ప్రపంచ నివేదికలు తెలుపుతున్నాయి. వీరిలో కొంతమంది మౌన రోదనతోనే జీవిస్తుంటే, మరికొంతమంది తిరగబడుతూ స్వేచ్ఛా జీవనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇలా మగాళ్లు పెత్తనం చెలాయించే ఈ ప్రపంచంలో కొన్ని వూళ్లు మాత్రం స్త్రీల అధీనంలోనే ఉన్నాయని మీకు తెలుసా ? అక్కడ మగవారు అడుగుపెట్టడానికి వీల్లేదంటే మీరు నమ్ముతారా ? అవును ఇది నిజమే ! మన ప్రపంచంలో ఇటువంటి వూర్లు కూడా కొన్నున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం రండి…Read more

సీతమ్మ తల్లి వ్యక్తిత్వం.. అడుగడుగునా ఆదర్శప్రాయం

క్షమ.. దయ.. ధైర్యం.. వివేకం.. ఆత్మాభిమానం అన్నీ కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర ‘సీత’. సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు వూహించలేం. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో పరిశోధనలు సైతం చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం.. ఆమె చరితం ఓ స్ఫూరిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి..Read more

ఇవి రామాయణ కాలం నాటి చిహ్నాలట!

రాముడు నడయాడిన ప్రదేశాలు మనకు పూజనీయమైనవి. మన దేశంలో ఏ ప్రదేశానికి వెళ్లినా రాముడు.. సీతాలక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతూ ఉంటారు. అంతేకాదు దానికి తగిన ఆనవాళ్లనూ చూపిస్తూ ఉంటారు. రఘునందనుడి పాదధూళి సోకిన చోట మందిరాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఉంటారు భక్తులు. అలాంటి ప్రదేశాలు కొన్ని చెప్పమంటే తెలుగు రాష్ట్రాలవారు మాత్రం భద్రాచలం అని ఠక్కున చెప్పేస్తారు. భద్రాద్రి ఒక్కటే కాదు..Read more

Blog at WordPress.com.

Up ↑