Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Glamour World

నాన్నతో అంత తేలిక కాదు !

స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లంతా స్టార్త్లెపోరనే విషయం తెలిసిందే ! ఆ స్టేటస్ సినీ రంగంలో ప్రవేశించడానికే పనికొస్తుంది కానీ సుస్థిర స్థానాన్నివ్వదు. అన్నిటికీ ప్రతిభే కొలమానం. అటువంటి ప్రతిభ ఉన్న తార అలియా భట్. దిగ్గజ దర్శకుడు మహేశ్ భట్ కూతురైనప్పటికీ ఎక్కడా ఆయన నీడను పడనివ్వకుండా సొంత స్టేటస్ సృష్టించుకుంది ఈ ‘రాజీ’ భామ. అందుకే రాజమౌళి ‘ళిళిళి’ లోనూ ఛాన్స్ కొట్టేసింది. అటువంటి నటి ఇప్పుడు ఒక దర్శకుడి చిత్రంలో నటించడం అంత తేలిక కాదంటోంది. ఎందుకో మీరే చదవండి !  Read More

డెలివరీ అయ్యాక 102 కిలోల బరువున్నా..!

‘ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావాలనుకున్నా.. కానీ కుదరలేదు..!’ అంటోంది అందాల నటి సమీరా రెడ్డి. బాలీవుడ్‌లో ‘మై నే దిల్ తుజ్ కో దియా’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ తార.. ‘నరసింహుడు’, ‘అశోక్’, ‘జై చిరంజీవ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2014లో అక్షయ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సమీరా.. వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉంటోంది. తను 2015లో ఒక బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సమీరా త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈక్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రెగ్నెన్సీ సమయంలో తనకెదురైన అనుభవాలు, తనను ఇబ్బంది పెట్టిన విషయాల గురించి చెప్పుకొచ్చిందీ తార.

మా ఇద్దరికీ అలా కుదురుతుంది.. అంతే !

కత్రినా కైఫ్ ! దశాబ్దన్నర కాలంగా యువ హృదయాలను గిలిగింతలు పెడుతున్న పేరు. మొదట అభినయం పరంగా కొన్ని విమర్శలను ఎదుర్కొన్నా తర్వాత కాలంలో అందంతో పాటు అభినయంతోనూ కట్టిపడేయగలనని నిరూపించుకుంది ఈ ‘మల్లీశ్వరి’. ఆమె నటించే అన్ని చిత్రాలు ఒక ఎత్త్తెతే సల్మాన్ ఖాన్‌తో నటించే చిత్రాలు మరొకెత్తు. దీనికి కారణం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి !  Read More

అలా సైఫ్ ప్రేమలో పడిపోయాను..!

బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ జంట కూడా ఒకటి. 2012లో వివాహం జరిగిన ఈ జంటకు తైమూర్ అనే కొడుకు ఉన్నాడన్న సంగతి తెలిసిందే. వయసు పరంగా సైఫ్, కరీనాల మధ్య పదేళ్ల తేడా ఉన్నప్పటికీ ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతోనే వీరి వివాహం జరిగింది.

అయితే ఇప్పటివరకు సైఫ్, కరీనాలకు పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్లు లేకపోవడం గమనార్హం. ఈక్రమంలో ఇటీవలే ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా కరీనా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.  Read More

అక్షయ్ మనశ్శాంతికి కారణమేంటో తెలుసా ?

కాలమిస్టుగా, రచయితగా ట్వింకిల్ ఖన్నాకి మంచి పేరుంది. పత్రికల్లో తన రచనల ద్వారా ఆమె విసిరే వ్యంగ్యాస్త్రాలకి, పుస్తకాల్లో ఆమె చూపే సెన్సాఫ్ హ్యూమర్‌కి చాలామంది ముగ్ధులవుతుంటారు.

ఎంత పెద్ద నాయకులైనా సరే, తన సెటైర్లతో వారికి చురకలంటిస్తుంది ట్వింకిల్. అందుకు ప్రధానమంత్రి మోదీ కూడా మినహాయింపు కాలేదు..  Read More

చైతూని ప్రశాంతంగా ఉండనివ్వను!

వెండితెరపైనే కాదు.. బయట కూడా చైతూ-సామ్‌లది చూడ ముచ్చటైన జంట అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడూ చైతూ నిదానంగా, సైలెంట్‌గా కనిపిస్తే.. మన సామ్ మాత్రం అందుకు భిన్నం. చిలిపితనం, దుడుకుతనం ఈ ముద్దుగుమ్మకు పెట్టని ఆభరణాలు. ఆన్‌స్క్రీన్-ఆఫ్‌స్క్రీన్..

ఇలా ప్రతి సందర్భంలోనూ తన భర్తతో చిలిపిగా వ్యవహరిస్తూ ఆకట్టుకునే ఈ అందాల తార.. తన మాటలతో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంది. ఎందుకో మీరే చదవండి!  Read More

పెళ్లికి తనలాగే మహారాణిలా రడీ అవుతా..!

పెళ్లి అనేది జీవితంలో ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక. ఈక్రమంలో పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో రకాల ఆశలు, కోరికలుండడం సహజం. అయితే కొంతమంది తమ పెళ్లి వేడుకలు ఘనంగా, అందరికీ గుర్తుండిపోయేలా, అంగరంగ వైభవంగా జరగాలని ఆశపడితే..

కొంతమంది మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా నిరాడంబరంగా జరగాలని కోరుకుంటుంటారు.

ఈక్రమంలో బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రాకు కూడా తన పెళ్లి విషయంలో కొన్ని ఆశలున్నాయట. తన అక్కా, బావ.. ‘ప్రియాంకా చోప్రా-నిక్ జోనస్’ల పెళ్లివేడుకలు జరిగినంత వైభవంగా తన పెళ్లి కూడా జరగాలని కోరుకుంటోందీ బ్యూటీ.  Read More

నీ ముఖంపై చిరునవ్వు చెరగనివ్వనని మాటిస్తున్నా..!

ఒక్క కన్నుగీటు వీడియో టీజర్‌తో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన అందాల తార ప్రియా ప్రకాశ్ వారియర్. గతేడాది తను నటించిన మొదటి సినిమా ‘ఒరు అడార్ లవ్’ చిత్రీకరణ దశలో ఉండగానే దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకుందీ తార. ఈ సినిమా విడుదలకు ముందే యువ హృదయాల్లో ప్రియ నేషనల్ క్రష్‌గా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ప్రియకు అగ్ర నటీనటులతో సమానంగా ఫాలోవర్లు ఉండడం విశేషం.

అయితే తన మొదటి సినిమాలో తనతో పాటు నటించిన రోషన్ అబ్దుల్ రహూఫ్‌తో ప్రియకు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23 రోషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది..  Read More

మా బుజ్జి పాపాయికి వెల్‌కమ్!

కడుపులో నలుసు పడ్డ దగ్గర్నుంచీ అమ్మయ్యే క్షణం వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ చిట్టి చిట్టి చేతులు, బుజ్జి బుజ్జి కాళ్లు, ముద్దుముద్దు మోము.. ఇలా పుట్టబోయే బిడ్డ రూపమే అనుక్షణం కళ్ల ముందు కదలాడుతుంటుంది. ఇక ఆ క్షణం రాగానే, తన ప్రతిరూపాన్ని చేతిలోకి తీసుకోగానే అమ్మ కళ్లలో కలిగే ఆనందాన్ని వర్ణించడానికి ఏ పదాలూ సరిపోవంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నారు ప్రముఖ నటి సుర్వీన్ చావ్లా – వ్యాపారవేత్త అక్షయ్ థాకర్ దంపతులు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన ఈ ముద్దుల జంట..

తాజాగా తన ముద్దుల పాపాయికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.  Read More

Blog at WordPress.com.

Up ↑