Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Yuva

ఆ విషయాలు ఎప్పటికీ మా మధ్యే ఉంటాయి..!

ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్త్టెల్ ఉంటుంది. ఈక్రమంలో బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా ఇటీవలే తన గర్ల్‌గ్యాంగ్‌తో చేసుకున్న పార్టీలో సరదాగా ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకున్నారట. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయ ఈషా అంబానీ పిరమల్ ఇంట్లో జరిగిన ఈ గర్ల్స్ నైట్‌లో పరిణీతితో పాటు ప్రియాంకా చోప్రా, ఈషా.. తదితర స్నేహితులు పాల్గొన్నారు.  Read More

మీ ప్రేమే నన్ను నిలబెట్టింది..!

‘ఆషికీ 2’.. 2013లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. శ్రద్ధా కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా పాటలు…Read more

అది నేనే.. ఈ కుక్కపిల్లకు పేరు పెట్టింది నేనే..!

పెంపుడు జంతువులను ఇంటి సభ్యులతో సమానంగా చూసేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. మనుషులకు పేర్లు పెట్టినట్లే వాటికి కూడా పేర్లు పెట్టి.. వాళ్లు ఆ పేర్లతో వాటిని పిలుస్తుండడం మామూలే. ఈక్రమంలో బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా కూడా తన అక్క ప్రియాంక చోప్రా పెంపుడు కుక్క పిల్లకు.. ‘బెయిలీ చోప్రా’ అని నామకరణం చేసింది. ‘తనే ‘బెయిలీ చోప్రా’..! నేనే (తన ఆంటీని) తనకు ఆ పేరు పెట్టాను. ఇలా చేయడం మీరు మరే పంజాబీ ఫ్యామిలీలో చూసుండరు..!’ అనే క్యాప్షన్‌తో ఫొటోను షేర్ చేసింది పరిణీతి. Read More 

నిజమైన సంతోషం ఇలాంటి వాటిలోనే ఉంటుంది..!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన తమ్మూలో ఓ ప్రకృతి ప్రేమికురాలు దాగుందని ఈ ఫొటోతో వెల్లడైంది. స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి అందులో రాలిన ఓ పువ్వుని మునగకుండా అపురూపంగా చేతిలోకి తీసుకుంటున్న ఫొటోని పంచుకుంటూ ‘అసలైన జీవన మాధుర్యం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే దాగుంది కదా..’  Read More

తేనెటీగ భయాన్ని అలా పోగొట్టింది..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు-నమ్రతల గారాల పట్టి సితార క్రేజ్ మామూలుగా లేదు. తను ఎక్కడికెళ్లినా, ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈక్రమంలో నమ్రత తన కూతురు సితార గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

సితారకు తేనెటీగలంటే చాలా భయమట. అవి కనిపిస్తే తను అసలు ఇంటి నుంచి అడుగు బయట కూడా పెట్టదట. అయితే మహేష్ కుటుంబం ప్రస్తుతం విహారయాత్రలో భాగంగా ప్యారిస్‌లో ఉంది. ఈక్రమంలో నమ్రత సితార చేయి పట్టుకొని రోడ్డుపై నడిపిస్తోన్న ఫొటోను తను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. Read More

రెడ్ అలర్ట్ ప్రకటించిన జాన్వీ..!

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైన అందాల తార జాన్వీ కపూర్. తన మొదటి సినిమా ‘ధడక్’ చిత్రంతోనే అటు ప్రేక్షకుల అదరణతో పాటు.. ఇటు విమర్శకుల ప్రశంసలూ అందుకుందీ బ్యూటీ. అయితే జాన్వీ ఇటీవలే ఓ కార్యక్రమానికి ఎరుపు రంగు డిజైనర్ చీరలో హాజరైంది.

ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జాన్వీ ప్రస్తుతం ఇండియన్ లేడీ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషిస్తోంది.  Read More 

ఈ ‘కూలింగ్ సాల్ట్’ గురించి విన్నారా?

సమ్మర్ అంటేనే విపరీతమైన వేడి. ఈ కాలంలో బయటి ఉష్ణోగ్రతలతో పాటు శరీర ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుంటాయి. తద్వారా శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో ఆవిరైపోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్లో శరీరానికి చలువ చేసే పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చలువ చేసే పదార్థాలంటే కేవలం నీటి శాతం ఎక్కువగా ఉండేవి మాత్రమే కాదు.. నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్)ను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. మన వంటల్లో అతి తక్కువగా వాడే ఈ ఉప్పు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.  Read More

‘ఎవరెస్ట్ అంచున’ మహర్షి జంట రొమాన్స్!

సూపర్‌స్టార్ మహేష్ బాబు, అందాల తార పూజా హెగ్డే కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పనులు ఇటీవలే ముగిశాయి. ఇప్పటివరకు ‘మహర్షి’ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈక్రమంలో ‘మహర్షి’ సినిమాలోని ‘ఎవరెస్ట్ అంచున’ అనే వీడియో సాంగ్ ప్రివ్యూను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. Read More

షార్ట్స్ వేసుకుందని అరెస్ట్ చేస్తారట !

మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం. కానీ ప్రపంచంలో జరిగే కొన్ని విషయాలు మనమింకా ఆదిమానవుల కంటే వెనుకే ఉన్నామని రుజువు చేస్తున్నాయి. మీ ఇంట్లో మీకు నచ్చిన బట్టలు వేసుకోవద్దంటే మీకెలా ఉంటుంది ? కోపమొస్తుంది కదూ..Read more

Blog at WordPress.com.

Up ↑