Search

Eenaduvasundhara

Empowering Woman

VK Tips

VK Tips- ఎండుమిర్చితో కూరకారం కొడుతున్నప్పుడు …

For More Tips Click Here

Inspirational Quotes from Vasundhara Kutumbam

For More Quotes Click Here

‘ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్’ ఫ్యాషన్లను పరిచయం చేస్తోన్న రష్మి!

సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్ని పోషిస్తూ.. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మలు కొందరే అని చెప్పుకోవాలి. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. కన్నడలో ‘గురు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ.. తెలుగులో ‘గుంటూర్ టాకీస్’, ‘తను వచ్చెనంట’, ‘అంతం’.. సినిమాలతో పేరు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే, అటు.. బుల్లితెరపై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోందీ అందాల తార. అయితే ఈ టీవీ షో ప్రజెంటర్‌గా ఆమెను ఇష్టపడే వారు కొందరైతే.. ఆ వేదికగా ఆమె ధరించే విభిన్న ఫ్యాషనబుల్ దుస్తులకు ఫిదా అయ్యే అమ్మాయిలు మరికొందరు.

అలా డిఫరెంట్ ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ.. వాటిని ఫొటోల్లో బంధిస్తూ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మరి, రష్మీ గౌతమ్ ఫ్యాషన్స్‌లో నుంచి కొన్ని సరికొత్త ఫ్యాషన్లు ఈ వారం మీకోసం..  Read More

ఆ రాజకుటుంబంలో తల్లిపాలే పట్టాలి!

గర్భం దాల్చిన మహిళలు లేట్ నైట్స్ బయట తిరగకూడదు.. అదీ.. ఆదివారం-అమావాస్య రోజు రాత్రి అస్సలు బయటకు వెళ్లకూడదు..
గర్భం ధరించాక మూడు నెలల తర్వాత మాత్రమే తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరికీ తెలియజేయడం మంచిది..
గర్భం ధరించిన సమయంలో దూర ప్రయాణాలు సురక్షితం కాదు..
ఇలా గర్భం ధరించిన మరుక్షణం నుంచీ బిడ్డ పుట్టే వరకూ కాబోయే అమ్మలకు మన ఇళ్లల్లోని పెద్ద వారు ఎన్నో రకాల నియమాలు, నిబంధనలు విధించడం మనకు తెలిసిందే. అంతేకాదు.. సీమంతం.. వంటి ప్రత్యేక వేడుకలతో కాబోయే అమ్మ ఒడి నింపి ఆమెను సంతృప్తి పరచడం మన సంప్రదాయం కూడా! ఇలాంటి సంప్రదాయాలు, నియమాలు మనకే కాదు.. బ్రిటన్ రాజకుటుంబంలోనూ బోలెడున్నాయి. బిడ్డ కడుపులో పడిన మరుక్షణం నుంచి పాపాయికి జన్మనిచ్చే వరకూ కాబోయే అమ్మలకు ఆ కుటుంబం పెట్టే నియమాలు, ఆచరించే సంప్రదాయాలు ఎన్నో! త్వరలో ప్రిన్స్ హ్యారీ – మేగన్ మార్కల్ జంట రాయల్ బేబీకి జన్మనివ్వబోతున్న సందర్భంగా శతాబ్దాల నుంచి బ్రిటన్ రాజకుటుంబం పాటిస్తోన్న కొన్ని ప్రెగ్నెన్సీ ట్రెడిషన్స్ గురించి మీకోసం..   Read More

ఆ విషయాలు ఎప్పటికీ మా మధ్యే ఉంటాయి..!

ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్త్టెల్ ఉంటుంది. ఈక్రమంలో బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా ఇటీవలే తన గర్ల్‌గ్యాంగ్‌తో చేసుకున్న పార్టీలో సరదాగా ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకున్నారట. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయ ఈషా అంబానీ పిరమల్ ఇంట్లో జరిగిన ఈ గర్ల్స్ నైట్‌లో పరిణీతితో పాటు ప్రియాంకా చోప్రా, ఈషా.. తదితర స్నేహితులు పాల్గొన్నారు.  Read More

ఈ గింజలతో వేసవితాపం తీర్చేద్దాం..!

మండు వేసవి అంటే ఇదేనేమో.. అనిపిస్తోంది బయట వాతావరణం చూస్తుంటే.. ఎండల ధాటికి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.. లోపలే ఉన్నా.. ఎండల వల్ల డీహైడ్రేషన్, వేడి వంటివి తగ్గట్లేదు. వీటన్నింటి నుంచీ విముక్తి కలిగించే అద్భుతమైన శక్తి సబ్జ గింజలకుంది.. నల్లని ఈ చిన్న గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వేడి పరారైపోవాల్సిందే..! అందుకే వాటితో చేసే ఈ రెసిపీలను ప్రయత్నించి చూడండి..  Read More

నాన్నతో అంత తేలిక కాదు !

స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లంతా స్టార్త్లెపోరనే విషయం తెలిసిందే ! ఆ స్టేటస్ సినీ రంగంలో ప్రవేశించడానికే పనికొస్తుంది కానీ సుస్థిర స్థానాన్నివ్వదు. అన్నిటికీ ప్రతిభే కొలమానం. అటువంటి ప్రతిభ ఉన్న తార అలియా భట్. దిగ్గజ దర్శకుడు మహేశ్ భట్ కూతురైనప్పటికీ ఎక్కడా ఆయన నీడను పడనివ్వకుండా సొంత స్టేటస్ సృష్టించుకుంది ఈ ‘రాజీ’ భామ. అందుకే రాజమౌళి ‘ళిళిళి’ లోనూ ఛాన్స్ కొట్టేసింది. అటువంటి నటి ఇప్పుడు ఒక దర్శకుడి చిత్రంలో నటించడం అంత తేలిక కాదంటోంది. ఎందుకో మీరే చదవండి !  Read More

కొడుకు కోసం 27 ఏళ్లు మృత్యువుతో పోరాడింది !

ఆ పిల్లాడి వయసు నాలుగు సంవత్సరాలు. ఎప్పటిలాగే స్కూలుకి వెళ్లాడు. కానీ ఆ రోజు తిరిగొచ్చే సమయానికి బస్సు లేదు. అతడిని తీసుకురావడానికి అతడి తల్లి స్కూలుకి వెళ్లింది.

అతడితో పాటు ఒక ట్యాక్సీలో ఇంటికి వస్తుండగా ఒక స్కూల్ బస్సు వారి ట్యాక్సీని గుద్దింది. వెనుక సీట్లో కూర్చున్న తల్లి పిల్లాడిని రక్షించడానికి రెండు చేతులతో అతడిని గుండెకు హత్తుకుంది. పిల్లాడు చిన్న గాయంతో బయటపడ్డాడు. కానీ తల్లి మటుకు తలకి బలమైన గాయమై కోమాలోకి వెళ్లింది. అలా 27 సంవత్సరాల పాటు కోమాలో ఉన్న ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత పలికిన మాట ‘ఒమర్’ !  Read More

మన ఫోను, ఏటీఎం.. టాయిలెట్స్ కంటే కలుషితమని తెలుసా ?

స్మార్ట్‌ఫోన్ ! ఇప్పుడు మనిషికిదో కృత్రిమ అవయవంలా మారిపోయింది. కాళ్లు లేకుండా నడవగలం, చేతులు లేకపోయినా పని చేయగలమేమో గానీ ఫోన్ లేకపోతే బతకలేం అనే స్థాయికి మనం వచ్చేశామని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అదే మన ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఇంకా శత్రువు కూడా ! అదేంటీ శత్రువెలా అయిందనుకుంటున్నారా ? కేవలం ఫోనే కాదు !

మనం నిత్యం వినియోగించే ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలు వంటి చాలా వస్తువులు పబ్లిక్ టాయిలెట్ల కంటే ప్రమాదకరమంటున్నారు వైద్యులు. మరి అదెలానో ఒకసారి చూద్దాం పదండి !   Read More

Blog at WordPress.com.

Up ↑