Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Anubandham

మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదు.. ఏం చేయాలి?

హాయ్ మేడం. నా వయసు 22. చదువు పూర్త్తెంది. ఒక మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను ఐదేళ్ల నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. మొన్నామధ్యే మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. మా అమ్మానాన్నలకు కులం పట్టింపులు ఎక్కువ. మా ఇద్దరి కులాలు వేరు. మాది ఎక్కువ కులం, అబ్బాయిది తక్కువ కులం కావడంతో మా విషయం ఇంట్లో తెలియగానే వాళ్లు నన్ను ఏమీ అనకుండా.. నువ్వు చదువుకోవాలంటే ఆ అబ్బాయిని మర్చిపో అన్నారు. దాంతో నేను నా చదువు ఆగిపోతుందని సరే అని కాలేజీకి వెళ్లాను. మేమిద్దరం దూరంగా ఉండడానికి చాలా ప్రయత్నించాం.. కానీ అది మా వల్ల కావట్లేదు. అతను నాకు బాగా దగ్గరైపోయాడు. జీవితంలో స్థిరపడితేనైనా అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకుంటారని మేం ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు ప్రేమను కొనసాగించాం.
నాకు మా అమ్మానాన్నంటే ప్రాణం.. అలాగని తననూ వదులుకోలేను. తనూ ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డాడు. మా ప్రేమ మా లక్ష్యాలకు అడ్డుకాకూడదని కష్టపడి చదువుకొని ఇప్పుడు స్థిరపడ్డాం. నన్ను తను చాలా బాగా చూసుకుంటాడు. మా ప్రేమను అబ్బాయి వాళ్లింట్లో ఒప్పుకున్నారు.. కానీ మా ఇంట్లో మాత్రం నాకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారని ఈ మధ్యే తెలిసింది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. నాకు జీవితంలో చాలా ఆశలు, ఆశయాలు ఉన్నాయి. నా జీవితంలో పెళ్లంటూ జరిగితే అది నేను ప్రేమించిన అబ్బాయితోనే జరగాలని కోరుకుంటున్నా.. తను కూడా అంతే..! ఇద్దరం పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు ఏం చేయాలో, మా పెద్దల్ని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి.  Read More

మీ బంధం ఆరోగ్యకరంగానే ఉందా ? చెక్ చేసుకోండి…

మనకో మనవారికో కలగబోయే ప్రమాదం ముందుగానే మనసుకి తెలియడం అప్పుడప్పుడూ జరుగుతుంది. దీన్నే కీడు శంకించడం అంటారు మన పెద్దలు. కానీ సరిగ్గా గమనిస్తే మన మనసుకు తగలబోయే గాయాలని కూడా శరీరం ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంటుంది. ప్రేమతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని మనందరికీ తెలుసు. కానీ అదే ప్రేమ పేరుతో ప్రమాదకరమైన మనుషులు మన జీవితంలోకి వస్తే ఆ విషయాన్ని శరీరం వెంటనే గుర్తించి కొన్ని రకాల హెచ్చరికలు చేస్తుంది. ఓ రిలేషన్‌షిప్‌లో నిరంతరమైన అసంతృప్తితో పాటు, శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆ మనుషులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి అలాంటి కొన్ని లక్షణాలేంటో తెలుసుకుందామా ..!  Read More

కీర్తి సోహన – వినయ్‌ల కల్యాణం.. కమనీయం.. కడురమణీయం!

‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో పందిరేసినట్లు.. అటేడు తరాలు ఇటేడు తరాలు గుర్తుండిపోయేలా’ంటి అత్యద్భుతమైన వివాహ ఘట్టానికి రామోజీ ఫిలింసిటీ వేదికగా నిలిచింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మనవరాలు, సుమన్ (దివంగత) – విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన – వినయ్‌ల కల్యాణ వేడుక రామోజీ ఫిలింసిటీలో కన్నుల పండువగా జరిగింది.

సినీ, పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. తమ వివాహంలో భాగంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కొత్త దంపతులు వేడుక ఆసాంతం చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయారు.  Read More

వీరి ప్రేమ బంధానికి 12 ఏళ్లు!

ఓవైపు గడ్డకట్టుకుపోయే చలి, మరోవైపు పిల్లగాలులు.. ఇలాంటి రొమాంటిక్ వాతావరణంలో ఏ అబ్బాయైనా తాను ప్రేమించిన అమ్మాయితో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని అడిగితే..? అదీ మోకాళ్లపై కూర్చొని ఓ అందమైన ఉంగరంతో ప్రపోజ్ చేస్తే..? అసలు అలాంటి ప్రపోజల్‌కే ఆ అమ్మాయి ఫిదా అయిపోతుందంటారా.. అవును.. మన బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఇలాగే అభిషేక్ ప్రేమలో పడిపోయింది.

న్యూయార్క్ సాక్షిగా ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకున్న ఈ జంట.. 2007, ఏప్రిల్ 20న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అంటే.. వీరి వివాహమై నేటికి సరిగ్గా 12 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మాల్దీవులకు చెక్కేసిందీ ముద్దుల జంట. Read More

దాంపత్య బంధం పటిష్టంగా ఉండాలంటే…

పెళ్త్లెన కొత్తలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. కొందరైతే.. ‘నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు’ అనే భావనతో ఉంటారు. కొన్నాళ్లకు ఏమవుతుందో ఏమో తెలియదు. ఇద్దరి మధ్య చిన్న విషయాలకే గొడవలు, అపార్థాలు, మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. ఇవి దంపతుల మధ్య అప్పటి వరకూ ఉండే అన్యోన్యతను తగ్గిస్తాయి. అసలీ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతుంది…Read more

‘మజిలీ’తో మరోసారి మాయ చేశారు..!

అటు ఆన్‌స్క్రీన్‌తో పాటు.. ఇటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ చూడముచ్చటగా కనిపించే జంటల్లో నాగచైతన్య, సమంతల జంట కూడా ఒకటి. ‘ఏ మాయ చేశావె’ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2017లో ఇరు కుటుంబాల ఆశీర్వాదాలతో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు చై, సామ్. వివాహం తర్వాత వీళ్లు ‘మహానటి’ సినిమాలో (సమంత: జర్నలిస్ట్ మధురవాణి, చైతన్య: అక్కినేని నాగేశ్వరరావు పాత్రల్లో) నటించినప్పటికీ.. కథ పరంగా వాళ్లిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు లేవు. ఈక్రమంలో వివాహానంతరం వాళ్లు పూర్తిస్థాయి హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్ను కోరి’ లాంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ.. ‘మజిలీ’ని రూపొందించారు. ఈ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రానికి.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడం విశేషం. ఈక్రమంలో సమంత, నాగ చైతన్యల జంట తెరపై మరోసారి మ్యాజిక్ చేశారంటున్నారు సినీ విశ్లేషకులు..  Read More

నేను చేసింది తప్పా?? ఒప్పా??

నేను చదువుకుంటున్న రోజుల్లో మా దగ్గర బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ  విషయం చెపినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు.

మా నాన్న అతనితో ఫోన్‌లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు నేను చాలా కుంగిపోయా. ఆ సమయంలో మా అమ్మానాన్నకి తెలిసిన సిద్ధాంతికి నా జాతకం చూపించి మా ఇద్దరి జాతకాలూ కలవలేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి మళ్లీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మానాన్నకి తెలియకుండా అలా మాట్లాడడం వారిని మోసం చేసినట్లే అవుతుందని నేనే అతన్ని వెళ్లిపోమన్నా. నా తల్లిదండ్రులు అంత చెప్పిన తర్వాత కూడా మరోసారి ప్రయత్నిస్తే వాళ్లు నన్ను బయటకి పంపించేస్తారు. అదీకాక కన్నవారిని బాధపెట్టి నేను ఏం సుఖపడగలను అనే ఉద్దేశంతో అలా చేశా.

కానీ ఇప్పుడు నాకు చాలా అయోమయంగా ఉంది. మా అమ్మానాన్నని నేను చాలా గుడ్డిగా నమ్మి, అతనికి అన్యాయం చేశానేమో అని బాధగా ఉంది. Read More

తాగి డ్యాన్స్ చేయనంటే వివస్త్రను చేసి, గుండు గీయించాడు…

గృహ హింస.. ఎన్నో ఏళ్లుగా మహిళలు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. అదనపు కట్నం తీసుకురావాలని కొందరు, చేసుకున్న భార్య అందంగా లేదని మరికొందరు, భార్య తన మాట వినట్లేదని ఇంకొందరు.. ఇలా మహిళలు అత్తింట్లో ఎదుర్కొంటోన్న వేధింపులెన్నో! తాజాగా అలాంటి సంఘటనే పాకిస్థాన్‌లోని లాహోర్‌లో బయటపడింది. గతేడాది మహిళలపై హింసకు సంబంధించి 2500 కేసులు నమోదు కాగా….Read more

వీళ్లిద్దరూ నన్ను అంత మాయ చేశారు..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సెలబ్రిటీ కపుల్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే జంట సమంత-నాగ చైతన్య. ‘ఏ మాయ చేశావె’ చిత్రంతో మొదలైన వీరి ప్రేమాయణం ఎనిమిదేళ్ల పాటు కొనసాగింది. 2017, అక్టోబర్ 7న ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో వివాహం చేసుకున్నారు చై, సామ్. వివాహానంతరం సమంత తన అత్తింటి వారి సభ్యులందరితో…Read more

Blog at WordPress.com.

Up ↑