Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Super Women

కొడుకు కోసం 27 ఏళ్లు మృత్యువుతో పోరాడింది !

ఆ పిల్లాడి వయసు నాలుగు సంవత్సరాలు. ఎప్పటిలాగే స్కూలుకి వెళ్లాడు. కానీ ఆ రోజు తిరిగొచ్చే సమయానికి బస్సు లేదు. అతడిని తీసుకురావడానికి అతడి తల్లి స్కూలుకి వెళ్లింది.

అతడితో పాటు ఒక ట్యాక్సీలో ఇంటికి వస్తుండగా ఒక స్కూల్ బస్సు వారి ట్యాక్సీని గుద్దింది. వెనుక సీట్లో కూర్చున్న తల్లి పిల్లాడిని రక్షించడానికి రెండు చేతులతో అతడిని గుండెకు హత్తుకుంది. పిల్లాడు చిన్న గాయంతో బయటపడ్డాడు. కానీ తల్లి మటుకు తలకి బలమైన గాయమై కోమాలోకి వెళ్లింది. అలా 27 సంవత్సరాల పాటు కోమాలో ఉన్న ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత పలికిన మాట ‘ఒమర్’ !  Read More

తండ్రికి పునర్జన్మనిచ్చిన కూతురు !

కూతురంటే ఎవరు ? అనే ప్రశ్నకి చాలామంది తండ్రులిచ్చే సమాధానం ‘జీవితం అందించిన అద్భుత బహుమానం’. జీవితాంతం తల్లి తోడుండలేదు కనుక ప్రకృతి కూతురు రూపంలో అమెను ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఈ మాటలను అక్షర సత్యం చేసింది కోల్‌కతాకి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి. తండ్రి కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు ? ఏం చేసిందో వివరాలలోకి వెళ్దాం పదండి !  Read More

కలెక్టర్ గారూ…హ్యాట్సాఫ్ !

సాధారణంగా కలెక్టర్ అంటే ఎలా ఉంటారు చెప్పండి ? వేలు, లక్షల్లో జీతం తీసుకుంటూ, విలాసవంతమైన ప్రభుత్వ భవంతిలో ఉంటూ, నిత్యం రెండు, మూడు వాహనాలున్న కాన్వాయ్‌లో జిల్లా పర్యటన చేస్తూ.. రాజభోగాలు అనుభవించే వారిలా కనిపిస్తారు కదూ ? వారిని చూస్తే చాలామందికి వెంటనే కలెక్టర్ అయిపోవాలనిపిస్తుంది. లేదంటే తమ పిల్లలనైనా కలెక్టర్ చేయాలనిపిస్తుంది. కానీ అందరూ అలా ఉండరు. అసలైన కలెక్టర్లు ఎలా ఉంటారో తెలుసా ? ఇదిగో.. ఈ వీడియోలో కనిపిస్తున్న స్త్రీలా ఉంటారు !  Read More

డియరెస్ట్ ఉప్సీ.. నిన్ను చూసి గర్విస్తున్నా!

‘మెగా’ కోడలిగా, నటుడు రామ్‌చరణ్ సతీమణిగానే కాకుండా.. ఓ ప్రముఖ వ్యాపావేత్తగా, సమాజ సేవకురాలిగా ఉపాసన రూటే సెపరేటు! డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన ఆమె నిరుపేదలు, అనాథ చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలందించడంతో పాటు అనేక సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల అందరిలో అవగాహన కల్పిస్తున్నారు కూడా!

ఇలా తను చేస్తోన్న సేవకు గుర్తింపుగా ‘ది బస్ట్ ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ద ఇయర్ – 2019’గా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం ఆమెను వరించింది…   Read More

ఆయన్ని చూశాకే బాక్సర్‌నయ్యా!

మనం మన జీవితంలో ఏదో ఒక దశలో, ఎవరో ఒకర్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాం.. వారి ప్రేరణతోనే మనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటాం. తానూ అంతేనంటోంది భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్. తాజాగా మూడు రోజుల పాటు జరిగిన ‘గోవా ఫెస్ట్ – 2019’లో పాల్గొన్న ఆమె.. అక్కడ తన గానమాధుర్యంతో అందరినీ అలరించడంతో పాటు తాను బాక్సింగ్ క్రీడను ఎంచుకోవడం వెనకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టింది…Read more

నాకు ప్రేమే ముఖ్యం.. అందుకే అన్నీ ఆయనకే వదిలేస్తున్నా!

ఓ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన ఆమెకు అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది క్రమంగా ప్రేమగా మారడంతో ముచ్చటగా మూడు నెలల వ్యవధిలోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆపై పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఏడాది తిరిగేలోపు ఒక కంపెనీని నెలకొల్పారాయన. అంతేకాదు.. దాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మలచడంలోనూ సఫలీకృతులయ్యారా దంపతులు. వారే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా పేరుపొందిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆయన మాజీ భార్య మెకంజీ బెజోస్.  Read More

ఈ పోలీసుల మనసు వెన్న!

కూడూ-గూడూ లేక ఫుట్‌పాత్‌లపై నివసించే పేదవాళ్లు.. కన్నవారు పట్టించుకోకపోతే రోడ్డున పడ్డ పిల్లలు.. వృద్ధులు… ఎంతోమంది నిరాశ్రయులు నిత్యం మనకు తారసపడుతూనే ఉంటారు. అయితే వారిని చూసినా చూడనట్లు వెళ్లిపోయే వారు కొందరైతే, వారిని దగ్గరికి తీసుకొని కడుపునిండా భోజనం పెట్టి తమ మానవత్వాన్ని చాటుకునే వారు మరికొందరుంటారు.

ఈ రెండో కోవలోకే చెందుతారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్వి అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. రోజుల తరబడి తిండి లేక అల్లాడుతోన్న ఓ వృద్ధురాలిని అక్కున జేర్చుకొని కడుపు నిండా ఆహారం పెట్టారామె. ఇలా తనలోని మానవత్వాన్ని చాటుకొన్న మాన్విపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాన్వి ఒక్కరే కాదు..  Read More

అందుకే ఆమెకు ‘అబెల్’ పురస్కారం!

ఒక్కొక్కరికీ ఒక్కో సబ్జెక్టుపై పట్టు, ఆసక్తి ఉంటాయి. అలాంటి వారు ఆయా విషయాల్లో మరింత పరిజ్ఞానాన్ని సంపాదించుకొని సరికొత్త ఆవిష్కరణలకు తెరతీయాలని, అవి భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడాలని అనుకుంటారు. అలాంటి వారిలో అమెరికాకు చెందిన కరెన్ ఉలెన్‌బెక్ కూడా ఒకరు.

చిన్నతనం నుంచీ గణితశాస్త్రంపై ఆమెకున్న మక్కువే ఆమెను గొప్ప మ్యాథమెటీషియన్ (గణితశాస్త్రవేత్త)గా ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు.. Read More

వాళ్లకు తనే చెవులు, చేతులు, కళ్లు!

ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోందామె. ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు వందల సంఖ్యలో పరీక్షలు రాస్తూనే ఉంది. అదేంటి..? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటున్నారు? మళ్లీ పరీక్షలు రాస్తోందంటున్నారు? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయినా…Read more

Create a free website or blog at WordPress.com.

Up ↑