Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Sweet Home

ఈ చికెన్ తింటే ఇదే కావాలంటారు !

చాలామంది ఎంతో ఇష్టంగా తినే వంటకం చికెన్. దాన్ని ఎప్పుడూ ఒకేలా వండితే ఏం బావుంటుంది చెప్పండి ? ఎలా వండినా చికెన్ చికెనే అంటారా ? అయితే ఈసారి ఈ ఆఫ్రికన్ స్త్టెల్లో వండి చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చికెన్ ప్రేమికులను అమితంగా ఇష్టపడేలా చేస్తున్న ఈ వంటకం పేరు ‘చికెన్ టొమాటో స్ట్యూ’. ఒక్కసారి మీ ఇంట్లో వారికి దీని రుచి చూపించారంటే ప్రతిసారీ చికెన్ ఇలాగే కావాలనడం ఖాయం. మరి ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా..Read more

ఈ గ్యాడ్జెట్స్‌తో గ్యాస్ స్టౌ చిటికెలో శుభ్రం..!

వంట చేయడం ఒక ఎత్తయితే చేసిన తర్వాత వంటింటిని శుభ్రం చేసుకోవడం మరో ఎత్తు. పొంగిపోయిన పాల మరకలు, బాణలిలోంచి చిందిన నూనె… ఇవన్నీ శుభ్రం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ‘తర్వాత చేద్దాంలే’ అనుకుంటే ఆ మరకలు ఎండిపోతాయి. అసలీ జంజాటమంతా లేకుండా వంట చేసేటప్పుడే మరకలు పడకుండా జాగ్రత్తపడితే సరిపోతుంది కదా….Read more

మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

మైగ్రెయిన్.. దీని గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమందే అని చెప్పుకోవాలి. లైట్, సౌండ్ సెన్సిటివిటీ వల్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. తలనొప్పితో పాటు వికారం, నీరసాన్ని కూడా మోసుకొచ్చే ఈ ఆరోగ్య సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తమ పనుల పట్ల శ్రద్ధ పెట్టలేక ఇంటికే పరిమితమవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక మన భారత్‌లో అయితే 12-15 శాతం మంది దీని బారిన పడి అటు తమ రోజువారీ…Read more

తాగండి.. చల్లచల్లని లస్సీ..!

భగభగ మండే భానుడి వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల శీతల పానీయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కృత్రిమమైన వాటి కన్నా ఆరోగ్యాన్ని పెంపొందించే పానీయాలనే ఎంచుకోవడం ఉత్తమం. సరిగ్గా అలాంటి కోవకు చెందిందే లస్సీ.. ఏంటీ, పేరు చెప్పగానే నోరూరిపోతోందా? నిజమే.. దాని రుచి మహత్యం అలాంటిది మరి! అసలు ఈ లస్సీని ఎలా తయారు చేస్తారు? దాని వల్ల మనకు ఎలాంటి లాభాలు చేకూరతాయి?.. వీటన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే…Read more

పిరియడ్స్ సమయంలో కలయిక మంచిదేనా?

పిరియడ్స్.. రోజు కంటే ఈ ఐదు రోజులూ కాస్త భిన్నం.. నొప్పి, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటివి ఈ సమయంలో కామన్. అయితే కొంతమంది నెలసరి సమయంలో నొప్పితో ఏమీ చేయాలనిపించక సైలెంట్‌గా ఉండిపోతారు. మరికొందరేమో రోజూ లాగే అన్ని పనులూ చేసేస్తుంటారు. కానీ నెలసరి సమయంలో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయంటున్నారు గైనకాలజిస్టులు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే ఆ ప్రభావం మన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పిరియడ్స్ సమయంలో చేయకూడని ఆ పనులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..Read more

శ్రీరాముడిని, ఆత్మారాముణ్ణీ సంతృప్తిపరిచేద్దామిలా!

ఈ శ్రీరామనవమికి వడపప్పు, పానకంతో పాటు సరికొత్త పాయసాలు, పిండివంటలూ చేయాలనుకుంటున్నారా.. అయితే మన తెలుగు రాష్ట్రాల వంటలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక స్పెషల్ రుచులనూ తెలుసుకుందాం. నైవేద్యంతో శ్రీరాముడినీ, ఆ తర్వాత భోజనంతో ఆత్మారాముణ్ణీ సంతృప్తిపరచాలంటే చదవండి మరి…Read more

ఈ బుడ్డోడి హెయిర్ స్త్టెల్‌కి ఫిదా అయిపోతున్నారట!

మీకు ఏ హీరో హెయిర్‌స్త్టెల్ అంటే ఇష్టం ? హృతిక్ రోషనా ? రణ్‌వీరా ? లేక రణ్‌బీరా ? మీ బాయ్‌ఫ్రెండ్ హెయిర్ స్త్టెల్ కూడా అలానే ఉండాలనుకుంటున్నారా ? అయితే మీరు ఎవర్ని ఇష్టపడినా సరే.. ఒక్కసారి ఈ బుడతడి హెయిర్‌స్త్టెల్ చూశారంటే వారిని మర్చిపోవడం ఖాయం. అంతలా ఇతడి హెయిర్‌స్త్టెల్‌కి ఫిదా అయిపోతారు. పుట్టి నాలుగు నెలలే అయినా ఈ బుడతడి హెయిర్‌స్త్టెల్‌కి ఇప్పుడు అంతర్జాలంలో అభిమానుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం పదండి !   Read More

వేసవిలో వీటికి దూరంగా..!

ఆరేళ్ల సహస్రకు ఐస్‌క్రీమ్ అంటే ప్రాణం.. అందుకే వేసవిలో రోజుకొకటి తప్పకుండా తింటుంది.
పద్దెనిమిదేళ్ల శాషాకు జంక్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. వేసవిలోనూ వాటిని వదలదు.
24ఏళ్ల సురభి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రెండు లేదా మూడుసార్లు టీ /కాఫీ తాగాల్సిందే..!
మీరూ అంతేనా.. అయితే వెంటనే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే వేసవి కాలంలో కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉంటేనే మన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని వారంటున్నారు.

ఇంతకీ వేసవిలో దూరంగా ఉంచాల్సిన కొన్ని ఆహారపదార్థాలేంటో తెలుసుకుందామా..  Read More

వేసవిలోనూ మొక్కలు పచ్చగా ఉండాలంటే..!

ఎండలు ఠారెత్తించేస్తున్నాయి.. వూపిరి సలపని వేడి కారణంగా కాసేపటికి మనమే బేజారవుతుంటే.. ఇక మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ ఎండ వల్ల వాటికి కూడా కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశాలున్నాయి. అంతేకాదు.. సాధారణంగా వేసవిలో గార్డెన్స్‌లోని ఆకులు, పూలు వాడిపోయినట్త్లె అందవిహీనంగా కనిపిస్తాయి. మరి, అలా జరగకుండా వేసవి అంతా మొక్కలు పచ్చగా, ఆకర్షణీయంగా ఉండాలంటే వాటి విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలంటున్నారు గార్డెనింగ్ నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందాం రండి.  Read More

Blog at WordPress.com.

Up ↑