Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Beauty & Fashion

మెడను మెరిపించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..

ముఖం అందంగా తయారవడం కోసం ఎన్నో రకాల క్రీములు, ప్యాక్‌లు వాడతాం. కానీ మెడ భాగానికొచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇరవైల్లో పెద్దగా తేడా తెలియకపోయినా.. వయసు పెరిగే కొద్దీ ఆ ప్రభావం మెడ మీద బాగా కనిపిస్తుంది. మెడ చుట్టూ నల్లటి వలయం, సన్నటి ముడతలు, చిన్న చిన్న పొక్కులతో క్రమంగా చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెడ సౌందర్యాన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా మరి..Read more

ఈ సాక్సులతో పాదాలు పదిలం..!

సౌందర్య పోషణలో మనం పాదాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వం. మరీ తప్పదనుకున్నప్పుడు పెడిక్యూర్ని ఆశ్రయిస్తుంటాం. కానీ చాలారోజులు పట్టించుకోకపోవడం వల్ల క్రమంగా పాదాలు దెబ్బతింటాయి. వేళ్ల మధ్య ఇన్‌ఫెక్షన్ రావడం, మడమల పగుళ్లు.. మొదలైన అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇవి పెరిగేకొద్దీ మనం నడిచే, నిలబడే భంగిమపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల మెడ, వెన్నెముకల్లోని కండరాలు ఒత్తిడికి గురౌతుంటాయి.

చూశారా.. పాదాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఎంత నష్టం జరుగుతుందో..! ఇక మీదట ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పాదాలని శుభ్రం చేసుకోవాలి. మాయిశ్చరైజర్లు లేదా ఫుట్ క్రీములు ఉపయోగించాలి. సరైన భంగిమలో నడవటం, నిలబడటం అలవాటు చేసుకోవాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.. వీటన్నిటితోపాటు మీ పాదాలకు హాయినిస్తూనే అనేక సమస్యలనుంచి సంరక్షించే రకరకాల సాక్సులు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటినీ ఒకసారి ప్రయత్నించి చూడండి.. అవేంటో చూసేద్దామా మరి..! Read More

‘మహానటి’ స్త్టెల్ ఫైల్ ఫాలో అవుతారా?

చూడగానే ఆకట్టుకునే రూపం, తన ఓరనవ్వుతో కుర్రకారు మతిపోగొట్టే అందం చెన్నై చిన్నది కీర్తి సురేశ్ సొంతం. తన బాయ్‌ఫ్రెండ్‌ని ‘శైలజా.. శైలజా..’ అని పాడుకునేలా చేసి, తెలుగువారిని కవ్వించిన ఈ బ్యూటీ.. ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’, ‘మహానటి’.. వంటి చిత్రాలతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ అందానికే కాదు.. ఫ్యాషన్లకూ ఫిదా అయిపోతున్నారు చాలామంది అమ్మాయిలు. ఎందుకంటారా..? అది పార్టీ అయినా, ప్రత్యేక సందర్భమైనా, క్యాజువల్‌గానైనా.. ఇలా ఆయా సందర్భానికి తగినట్లుగా డ్రస్సింగ్ చేసుకొని నేటి అమ్మాయిల ఫ్యాషన్ క్వీన్‌గా మారిపోయిందీ అందాల తార. అందుకే ఆమె సోషల్ మీడియా పేజీల్ని తెగ ఫాలో అయిపోతూ, అలాంటి ఫ్యాషన్లను తమ వార్డ్‌రోబుల్లో భాగం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో మన కీర్తి స్త్టెల్ ఫైల్‌ని ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం.. మీరూ ట్రై చేయండి మరి.  Read More

ఈ ‘ఉగాది ఫేస్ ప్యాక్స్’తో మెరిసిపోండిలా..!

తెలుగు లోగిళ్లన్నీ సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. పచ్చపచ్చటి తోరణాలతో, రంగురంగుల పూలతో.. ముంగిళ్లన్నీ అలంకరించుకుని ముగ్ధమనోహరంగా ముస్తాబయ్యే తరుణమే ‘ఉగాది’. మరి ఈ రోజున కొందరు కొత్త పనులకు శ్రీకారం చుడితే, మరికొందరు రాశిఫలాలు చూసుకోవడంలో బిజీ అయిపోతారు. అంతేనా..! ఉగాది పండగ స్పెషల్ ‘ఉగాది పచ్చడి’ రుచిని ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తామా..? అని ఉబలాటపడుతుంటారు. మరి దీనికి అంతటి రుచిని అందించిన షడ్రుచులు.. కేవలం దాని రుచిని ద్విగుణీకృతం చేయడమే కాదు.. మన అందాన్నీ మరింతగా పెంచుతాయి.. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అయితే అదెలాగో తెలియాలంటే ఇదోసారి చదవాల్సిందే!  Read More

ఈ ఫ్యాషన్స్‌తో ‘ఉగాది’ శోభంతా మీదే!

నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ తెలుగు వారంతా పెద్ద ఎత్తున జరుపుకునే పండగే ‘ఉగాది’. అయితే పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది అతివలే! ఎందుకంటారా..? సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వారు నట్టింట్లో నడుస్తుంటే పండగ కళంతా వారిలోనే ఉట్టిపడుతుందేమో అన్నంత అందంగా కనిపిస్తారు. మరి, మారుతోన్న కాలంతో పాటు ఫ్యాషన్స్‌లోనూ వివిధ రకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్రెడిషనల్ దుస్తులూ ఇందుకు…Read more

కొరియన్ల బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా..?

కాంతివంతమైన చర్మం.. వయసు పైబడుతున్నా వన్నెతరగని ముఖ వర్చస్సు కొరియన్ల సొంతం. అందుకు వారి జన్యు లక్షణాలు ఒక కారణమైతే, క్రమం తప్పకుండా వారు పాటించే కొన్ని సౌందర్య చిట్కాలు మరో ముఖ్యమైన కారణం. మొటిమలు, మచ్చలు రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా వారు తీసుకునే జాగ్రత్తలేమిటో మనమూ తెలుసుకుందామా మరి….Read more

‘గీత’ వార్డ్‌రోబ్ రహస్యాలివే!

‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే.. నా మనసులోకీ.. హో అందంగా దూకీ..’ అంటూ తన అపురూప లావణ్యం, అభినయంతో కుర్రకారును మాయ చేసిన అందాల తార రష్మిక మంధాన. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘దేవదాస్’.. వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన ఈ కన్నడ బ్యూటీ.. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’, ‘భీష్మ’.. వంటి సినిమాలతో…Read more

ఈ గ్యాడ్జెట్స్‌తో ఐ మేకప్ అదుర్స్..!

ఒక పక్క పార్టీకి టైమైపోతుంది.. మరోపక్క ఐలైనర్‌తో వింగ్ ఎంతకీ కుదరదు.. ఐ బ్రో షేపౌట్ అవుతుంది. కనురెప్పపై పర్ఫెక్ట్ ఐ లైన్ లేకుండా, ఐబ్రో షేప్ కుదరకుండా.. మేకప్ పూర్తవదు కదూ..! అయితే ఇక నుంచీ ఐ మేకప్ రెండే రెండు నిమిషాల్లో వేసుకోవచ్చు. అదీ పర్ఫెక్ట్‌గా..! ఎలాగో చూసేద్దామా మరి..!  Read More

చర్మానికి చల్లదనాన్నిచ్చే ప్యాక్స్ ఇవే..!

వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఎండ వేడికి చర్మం మండిపోతూ, ఎర్రగా కమిలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లి వస్తే ముఖంలో కళ పోయి నిర్జీవంగా మారిపోతుంది. మరి, అలసిపోయిన చర్మానికి తిరిగి జీవం పోసి, వేసవి వేడిమి నుంచి చల్లదనాన్ని అందించే ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. ఎందుకు లేవూ..! ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే కొన్ని ప్యాక్స్ తయారుచేసుకొని వాటి ద్వారా వేసవిలో చర్మాన్ని సంరక్షించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ ఆ ప్యాక్స్ ఏంటి? Read More

Create a free website or blog at WordPress.com.

Up ↑