Search

Eenaduvasundhara

Empowering Woman

Category

Anubandham

30 ఏళ్ల తర్వాత మళ్లీ అలా కలిశారు!

చిన్నారులు అప్పుడప్పుడే స్కూలుకెళ్లిన తొలి రోజుల్లో వారికి ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. అందులో స్వీట్ మెమరీస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ టీచర్ అంటే ఏదో తెలియని అభిమానం ఉంటుంది. ఆ టీచర్‌కి మనపైనా ‘బెస్ట్ స్టూడెంట్’ అన్న ముద్ర…Read more 

పేదరికమే మాతో కత్తెర పట్టించింది!

క్షవరం..సాధారణంగా ఇది అబ్బాయిలు చేసే పని.. ఒకవేళ అమ్మాయిలు చేస్తానన్నా సమాజం వాళ్లని చిన్న చూపు చూడడం, వారిని వేలెత్తి చూపించడం ఖాయం. అయినా ఆ అక్కచెల్లెళ్లకు తమ ఆర్థిక సమస్యల ముందు ఇవన్నీ చాలా చిన్నగా కనిపించాయి. బతుకుదెరువు కోసం వారిచే కత్తెర పట్టించాయి. పిల్లలే ఇంటికి పెద్ద దిక్కుగా మారి కుటుంబ పోషణ భారాన్ని భుజాలకెత్తుకునేలా చేశాయి. ఇలా ఈ పనిని కేవలం పురుషులే కాదు.. మహిళలూ చేయగలరని నిరూపించారు ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు. మరి, వారెవరు? వారి కథేంటో వారి మాటల్లోనే విందాం రండి..   Read More

నేను, అత్తయ్య ఒకేలా ఉన్నాం కదూ… అందుకే చైతూ ఎంతో హ్యాపీ!

అబ్బాయిలందరూ అమ్మలా ఉండే జీవిత భాగస్వామి కోసం చూస్తారట. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు.. అక్కినేని వారి కోడలు సమంత. ఇటీవల తన విషయంలోనే ఇది రుజువైందని కూడా అంటోందీ బ్యూటీ. తమ రెండేళ్ల వైవాహిక బంధాన్ని నిత్యనూతనంగా ఆస్వాదిస్తోన్న ఈ లవ్లీ కపుల్.. జంటగా వెకేషన్స్‌కి వెళ్లడమే కాదు..

వీలు చిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇటీవలే సామ్ అలాంటి ఓ మధురమైన సందర్భాన్ని ఫొటోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.  Read More 

‘కూతుళ్లే ది బెస్ట్’ అంటున్న బిగ్‌బీ.. ఎందుకో తెలుసా?

ఏ తండ్రికైనా కొడుకుల కంటే కూతుళ్లపైనే ఎక్కువ ప్రేముంటుందన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్నప్పట్నుంచి పెరిగి పెద్దయ్యేదాకా తన కూతురికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎంతో అపురూపంగా చూసుకుంటాడు.. కూతురు విజయాన్ని తన విజయంగా ఆస్వాదిస్తూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతుంటాడు కూడా! ఇందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా మినహాయింపేమీ కాదు. అందుకే ‘డాటర్స్ ఆర్ ది బెస్ట్’ అంటున్నారు. తన కూతురు విషయంలో ఇటీవలే ఆయనకు ఎదురైన ఓ స్వీట్ మెమరీ ఏడు పదుల వయసులోనూ ఆయనతో మురిపెంగా విజిల్ కూడా వేయించింది. మరి, అంతగా ఈ మెగాస్టార్‌ను పుత్రికోత్సాహంలో ముంచేసిన ఆ సందర్భమేంటో మనమూ తెలుసుకుందాం రండి. Read More

ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో నా అనుభవాలు ఇవీ..!

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషం ఇంటర్నెట్ పనిచేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? దాదాపు 500కోట్ల వ్యాపార నష్టం వాటిల్లుతుంది. 1500 కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోతాయి..! అంతేకాదు.. ఆ నిమిషం వెల్లువెత్తే సెర్చ్‌లకు లెక్క కట్టడం కూడా కష్టమే.. ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా మనకు మాత్రం ఆ నిమిషం ప్రపంచమే స్తంభించిపోతుంది. మెలకువగా ఉన్నంతసేపూ ఆన్‌లైన్‌లో ఉండడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం మనకు. ఇక నిరంతరం ఛాటింగ్‌లో ఉండేవారు, రకరకాల వెబ్‌సైట్లలో గడిపేవారు ఇవేవీ లేకుండా క్షణమైనా ఉండలేరు.. కానీ అసలు వెబ్‌సైట్ అనేది లేని కాలంలో ప్రపంచం ఎలా ఉండేదో వూహించగలరా..?  Read More

నా జీవితమంతా ఈ ఫ్రేములోనే ఉంది!

ఆమె ఫుట్‌పాత్‌పై నివసించిన ఒక మహిళ కూతురు.. అతను బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్ స్టార్. వీరిద్దరూ ఆదర్శ అన్నాచెల్లెళ్లుగా మారతారని ఎవరూ వూహించి ఉండరు. బహుశా దీన్నే విధి అంటారేమో? అందుకే ఆకాశమంత అందలంపై ఉన్న సల్మాన్ ఖాన్‌కి అనామకురాలైన అర్పిత ముద్దుల చెల్లెలిగా మారిపోయింది. Read More

అత్తగారి బహుమానం అక్షరాలా..!

వివాహం తర్వాత తమ ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త కోడలికి అత్తగారు ఏదో ఒక కానుకివ్వడం మన భారతీయ సంప్రదాయం. ఈ క్రమంలో కొందరేమో తమ వంశపారంపర్యంగా వచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువుల్ని గిఫ్ట్‌గా అందిస్తే.. మరికొంతమందేమో విభిన్న బహుమతులతో కోడలిని సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా అదే మూడ్‌లో ఉన్నారు. తన పెద్ద కొడుకు ఆకాశ్-శ్లోకాల వివాహం ఇటీవలే ముంబయిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.  Read More

ఫిల్మ్‌ఫేర్ వేదికపై వీరి ముద్దూ-ముచ్చట్లు చూశారా?

ఒకరేమో తన ముద్దుల భార్య చేతుల మీదుగా అవార్డు అందుకొని ఆమెపై తన మనసులో దాగున్న ప్రేమను చాటుకుంటే; మరొకరేమో తన కలల రాకుమారుడికి ప్రత్యక్షంగా ఐలవ్యూ చెప్పి అందరి మన్ననలు అందుకున్నారు. అవును.. తాజాగా ముంబయి వేదికగా జరిగిన 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ అందాల జంటలు దీపిక-రణ్‌వీర్, అలియా-రణ్‌బీర్‌లు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎందుకు.. అవార్డులు అందుకున్నందుకా.. అంటారా? అంతేకాదు..  Read More 

వెంకీ కూతురి పెళ్లిలో తారల సందడి!

ఈ ఏడాది ప్రారంభం నుంచే సెలబ్రిటీల పెళ్లిళ్లు ఒకదాని తర్వాత మరొకటి వరుస పెట్టి జరుగుతున్నాయి. ఇప్పటికే ఆకాశ్ అంబానీ – శ్లోకా మెహతా, ఆర్య – సాయేషా సైగల్‌లు తమ ప్రేమను పెళ్లిపీటలెక్కించగా.. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ గారాలపట్టి కూడా చేరిపోయింది. Read More 

Create a free website or blog at WordPress.com.

Up ↑