సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్ని పోషిస్తూ.. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మలు కొందరే అని చెప్పుకోవాలి. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. కన్నడలో ‘గురు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ.. తెలుగులో ‘గుంటూర్ టాకీస్’, ‘తను వచ్చెనంట’, ‘అంతం’.. సినిమాలతో పేరు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే, అటు.. బుల్లితెరపై ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోందీ అందాల తార. అయితే ఈ టీవీ షో ప్రజెంటర్‌గా ఆమెను ఇష్టపడే వారు కొందరైతే.. ఆ వేదికగా ఆమె ధరించే విభిన్న ఫ్యాషనబుల్ దుస్తులకు ఫిదా అయ్యే అమ్మాయిలు మరికొందరు.

అలా డిఫరెంట్ ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ.. వాటిని ఫొటోల్లో బంధిస్తూ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మరి, రష్మీ గౌతమ్ ఫ్యాషన్స్‌లో నుంచి కొన్ని సరికొత్త ఫ్యాషన్లు ఈ వారం మీకోసం..  Read More