గర్భం దాల్చిన మహిళలు లేట్ నైట్స్ బయట తిరగకూడదు.. అదీ.. ఆదివారం-అమావాస్య రోజు రాత్రి అస్సలు బయటకు వెళ్లకూడదు..
గర్భం ధరించాక మూడు నెలల తర్వాత మాత్రమే తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరికీ తెలియజేయడం మంచిది..
గర్భం ధరించిన సమయంలో దూర ప్రయాణాలు సురక్షితం కాదు..
ఇలా గర్భం ధరించిన మరుక్షణం నుంచీ బిడ్డ పుట్టే వరకూ కాబోయే అమ్మలకు మన ఇళ్లల్లోని పెద్ద వారు ఎన్నో రకాల నియమాలు, నిబంధనలు విధించడం మనకు తెలిసిందే. అంతేకాదు.. సీమంతం.. వంటి ప్రత్యేక వేడుకలతో కాబోయే అమ్మ ఒడి నింపి ఆమెను సంతృప్తి పరచడం మన సంప్రదాయం కూడా! ఇలాంటి సంప్రదాయాలు, నియమాలు మనకే కాదు.. బ్రిటన్ రాజకుటుంబంలోనూ బోలెడున్నాయి. బిడ్డ కడుపులో పడిన మరుక్షణం నుంచి పాపాయికి జన్మనిచ్చే వరకూ కాబోయే అమ్మలకు ఆ కుటుంబం పెట్టే నియమాలు, ఆచరించే సంప్రదాయాలు ఎన్నో! త్వరలో ప్రిన్స్ హ్యారీ – మేగన్ మార్కల్ జంట రాయల్ బేబీకి జన్మనివ్వబోతున్న సందర్భంగా శతాబ్దాల నుంచి బ్రిటన్ రాజకుటుంబం పాటిస్తోన్న కొన్ని ప్రెగ్నెన్సీ ట్రెడిషన్స్ గురించి మీకోసం..   Read More