అన్యోన్య దాంపత్యానికి, ఆలుమగల అనురాగానికి ప్రతిరూపాలు పిల్లలు. అందుకే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిసిన మరుక్షణం దంపతుల కళ్లు మతాబుల్లా వెలిగిపోతాయి. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో ఎప్పుడెప్పుడు చెబుదామా అని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో స్వీట్లు పంచుతూ చెప్పే వారు కొందరైతే, రాబోయే పాపాయికి సంబంధించిన బుజ్జి బుజ్జి డ్రస్సుల్ని ఇంట్లో వారికి చూపుతూ తమ ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసే వారు మరికొందరుంటారు..

ఇంకొందరేమో.. ‘మీరు త్వరలో అమ్మమ్మ-తాతయ్య/నాన్నమ్మ-తాతయ్య కాబోతున్నారు..’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేవారూ లేకపోలేదు.. మరి, ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‌లో మనకే ఇన్ని ఆలోచనలుంటే..

ఇక బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల సంగతేంటి..? వారూ ఎంతో డిఫరెంట్‌గా తమ ప్రెగ్నెన్సీ గురించి అందరికీ తెలియజేసి తమ అభిమానుల మనసు దోచుకున్నారు. అలా తాజాగా మన ముందుకొచ్చాడు బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో అర్జున్ రాంపాల్. తన గర్ల్‌ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మోడల్ అయిన గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ ప్రస్తుతం గర్భవతి అని, త్వరలో తామిద్దరం ఓ బుజ్జి పాపాయికి జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడీ రొమాంటిక్ హీరో. ఈ నేపథ్యంలో విభిన్న పద్ధతుల్లో తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి అభిమానుల మనసు దోచుకున్న కొందరు తారల గురించి తెలుసుకుందాం రండి..  Read More