పెంపుడు జంతువులను ఇంటి సభ్యులతో సమానంగా చూసేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. మనుషులకు పేర్లు పెట్టినట్లే వాటికి కూడా పేర్లు పెట్టి.. వాళ్లు ఆ పేర్లతో వాటిని పిలుస్తుండడం మామూలే. ఈక్రమంలో బాలీవుడ్ అందాల తార పరిణీతి చోప్రా కూడా తన అక్క ప్రియాంక చోప్రా పెంపుడు కుక్క పిల్లకు.. ‘బెయిలీ చోప్రా’ అని నామకరణం చేసింది. ‘తనే ‘బెయిలీ చోప్రా’..! నేనే (తన ఆంటీని) తనకు ఆ పేరు పెట్టాను. ఇలా చేయడం మీరు మరే పంజాబీ ఫ్యామిలీలో చూసుండరు..!’ అనే క్యాప్షన్‌తో ఫొటోను షేర్ చేసింది పరిణీతి. Read More