హాయ్ మేడం. నా వయసు 36. నాకు పెళ్త్లె 19 ఏళ్త్లెంది. ఇద్దరు పిల్లలున్నారు. నాకు మొదట్నుంచీ ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య ఉంది. దీంతో పిల్లలు కారేమో అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల పెళ్త్లెన ఏడాదికే గర్భం ధరించా. ఇక గత రెండేళ్ల నుంచి పిరియడ్స్ సమస్య మరింత ఎక్కువైంది. నెలకో, రెండు నెలలకో, ఒక్కోసారి మూడు నెలలకు కూడా నెలసరి వస్తుంటుంది. ఈసారి కూడా పిరియడ్ రాక మూడు నెలలవుతోంది. డాక్టర్ దగ్గరికెళ్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారు.

కానీ నాకు రెండోసారి డెలివరీ అప్పుడే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేశారు. ఈ మధ్య నేను బాగా లావైపోతున్నా. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నా.. దాంతో కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తుంది. నా సమస్యల్లా ఇర్రెగ్యులర్ పిరియడ్స్.. బాగా బరువు పెరగడం.. కాళ్లలో నీరు కూడా బాగా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?

నేను బరువు పెరగడానికి ప్రధాన కారణమేంటి? పిరియడ్స్ సక్రమంగా రావాలంటే ఏంచేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు.  Read More