అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైన అందాల తార జాన్వీ కపూర్. తన మొదటి సినిమా ‘ధడక్’ చిత్రంతోనే అటు ప్రేక్షకుల అదరణతో పాటు.. ఇటు విమర్శకుల ప్రశంసలూ అందుకుందీ బ్యూటీ. అయితే జాన్వీ ఇటీవలే ఓ కార్యక్రమానికి ఎరుపు రంగు డిజైనర్ చీరలో హాజరైంది.

ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జాన్వీ ప్రస్తుతం ఇండియన్ లేడీ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషిస్తోంది.  Read More