తక్కువ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కథానాయికలు కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ నందితా శ్వేత ఒకరు. ప్రియురాలిగా, స్నేహితురాలిగా, దెయ్యంగా.. ఇలా ప్రతి పాత్రలో చక్కగా ఒదిగిపోయే ఈ ముద్దుగుమ్మ.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘శ్రీనివాస కల్యాణం’, ‘ప్రేమకథా చిత్రం 2’తో మన ముందుకొచ్చిన ఈ చిన్నది.. కేవలం తన పాత్రలతోనే కాదు.. తన ఫ్యాషన్స్‌తోనూ నేటి యువతులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఫ్యాషన్ క్వీన్ ఫాలో అయ్యే కొన్ని విభిన్న ఫ్యాషన్స్‌ని ఈ వారం ‘వసుంధర.నెట్’ మీకు ప్రత్యేకంగా అందిస్తోంది.  Read More