ఓవైపు గడ్డకట్టుకుపోయే చలి, మరోవైపు పిల్లగాలులు.. ఇలాంటి రొమాంటిక్ వాతావరణంలో ఏ అబ్బాయైనా తాను ప్రేమించిన అమ్మాయితో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని అడిగితే..? అదీ మోకాళ్లపై కూర్చొని ఓ అందమైన ఉంగరంతో ప్రపోజ్ చేస్తే..? అసలు అలాంటి ప్రపోజల్‌కే ఆ అమ్మాయి ఫిదా అయిపోతుందంటారా.. అవును.. మన బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా ఇలాగే అభిషేక్ ప్రేమలో పడిపోయింది.

న్యూయార్క్ సాక్షిగా ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకున్న ఈ జంట.. 2007, ఏప్రిల్ 20న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అంటే.. వీరి వివాహమై నేటికి సరిగ్గా 12 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మాల్దీవులకు చెక్కేసిందీ ముద్దుల జంట. Read More