సూపర్‌స్టార్ మహేష్ బాబు, అందాల తార పూజా హెగ్డే కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పనులు ఇటీవలే ముగిశాయి. ఇప్పటివరకు ‘మహర్షి’ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈక్రమంలో ‘మహర్షి’ సినిమాలోని ‘ఎవరెస్ట్ అంచున’ అనే వీడియో సాంగ్ ప్రివ్యూను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. Read More