అటు ఆన్‌స్క్రీన్‌తో పాటు.. ఇటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ చూడముచ్చటగా కనిపించే జంటల్లో నాగచైతన్య, సమంతల జంట కూడా ఒకటి. ‘ఏ మాయ చేశావె’ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2017లో ఇరు కుటుంబాల ఆశీర్వాదాలతో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు చై, సామ్. వివాహం తర్వాత వీళ్లు ‘మహానటి’ సినిమాలో (సమంత: జర్నలిస్ట్ మధురవాణి, చైతన్య: అక్కినేని నాగేశ్వరరావు పాత్రల్లో) నటించినప్పటికీ.. కథ పరంగా వాళ్లిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు లేవు. ఈక్రమంలో వివాహానంతరం వాళ్లు పూర్తిస్థాయి హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్ను కోరి’ లాంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ.. ‘మజిలీ’ని రూపొందించారు. ఈ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రానికి.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడం విశేషం. ఈక్రమంలో సమంత, నాగ చైతన్యల జంట తెరపై మరోసారి మ్యాజిక్ చేశారంటున్నారు సినీ విశ్లేషకులు..  Read More