‘మల్టీ టాలెంటెడ్ కిడ్’ అన్న పదానికి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ముద్దుల కూతురు జివా ధోనీ సరిగ్గా సరిపోతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా! నాలుగేళ్ల ఈ చిన్నారి పుట్టినప్పటి నుంచే తనలోని విభిన్న నైపుణ్యాలతో తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఇలా తన చిన్నారి ముద్దూ-ముచ్చట్లను ఫొటోలు, వీడియోల్లో బంధిస్తూ ధోనీ-సాక్షీలిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి కాస్తా వైరల్‌గా మారడం మనకు తెలిసిందే.  Read More