ఆదివారం ఆడవాళ్లకు సెలవు.. కావాలా?
Share@ www.vasundhara.net
కాలం మారుతున్న కొద్దీ ఆడపని, మగ పని అంటూ వేరు వేరుగా లేకుండా పోతోంది. ఆడవాళ్లు ఇటు ఇంటిపనులు చక్కబెడుతూ, అటు ఉద్యోగాలూ చేస్తున్నారు. ఆఫీసు బాధ్యతలూ సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మగవారికే పరిమితమైన వృత్తిఉద్యోగాలు ఇప్పుడు ఆడవాళ్లూ చేస్తున్నప్పుడు వారికి ఇంటిపనుల్లో సహాయం చేయడం భర్తల ధర్మం. ఎవరో కొంతమంది ఇంటిపనుల్లో భార్యకి సాయం చేస్తున్నా ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ‘ఇంటిపనులంటే ఇల్లాలివే..’ అన్న పద్ధతే నడుస్తోంది.. అందుకే వారానికి కనీసం ఒక్కరోజైనా మహిళలకు ఇంటి పనుల నుంచి సెలవు కావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపైన అవగాహన కలిగించే విధంగా మీడియాలో కొన్ని ప్రకటనలు కూడా రూపొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో మహిళలకు కేవలం ఆదివారం ఒక్కరోజు ఇంటిపనుల నుంచి సెలవు లభిస్తే సరిపోతుందా? లేక భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజూ ఇంటి పనులన్నింటినీ సమంగా పంచుకోవాలంటారా? మహిళలూ బయటకెళ్లి ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో అసలు ఇంటిపనుల బాధ్యత ఎవరు తీసుకోవాలి? ‘వసుంధర.నెట్’ వేదికగా మీ అభిప్రాయాలు పంచుకోండి..