“అమ్మ… మాటనేర్చిన తరువాత పలికే మొదటి మాట”,
“అమ్మ… ఏ చిన్న కష్టం వచ్చిన తలుచుకునే మొదటి వ్యక్తి”,
“అమ్మ… మన విజయానికి సంతోషించే మొదటి వ్యక్తి”
“అమ్మ… మనకి కష్టం వస్తే బాధపడే మొదటి వ్యక్తి”

ఆ సర్వాంతర్యామి సైతం అమ్మ ప్రేమకు దాసుడే…
కడుపులో పడినప్పటినుండి కంటికి రెప్పలా కాపాడుతూ…
ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి జన్మనిచ్చిన అమ్మకి మనం ఏమివ్వగలం…? “ ప్రేమను తప్ప…”

ప్రేమంటే మదర్స్ డే రోజు… ఇచ్చే గ్రీటింగ్ కార్డో, గిఫ్టులో కాదు…
అమ్మని దేవతలా కాకుండా అమ్మగానే చూద్దాం…
అమ్మ అలిసిపోయినపుడు సేవ చేద్దాం…
అమ్మకి పనిలో సహాయం చేద్దాం…
మనమిచ్చే చిటికెడు ప్రేమకి, కొండంత ఆనందిస్తుంది, ఆశీస్సులూ ఇస్తుంది…

“అమ్మతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుదాం, ఒక అమ్మ కోరుకునేది ఇంతకు మించి ఏమిలేదు…”